భద్రాద్రిలో మురసు తుపాను బీభత్సం: భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగుతుండటంతో రాకపోకలు నిలిపివేత

రిపోర్టర్: రమేష్ స్థలం: భద్రాద్రి కొత్తగూడెం

మురసు తుపాను ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, వాగులు పొంగిపొర్లుతున్నాయని అధికారులు తెలిపారు. ఎడతెరిపి లేని వానలతో పంటలు నీట మునిగాయని, విద్యార్థుల భద్రత కోసం పలు మండలాల్ లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించామని పేర్కొన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను అప్రమత్తం చేశారని వెల్లడించారు.