బిగ్ బాస్ కన్నడ చరిత్రలో తొలిసారిగా ఊహించని ఎలిమినేషన్!

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: కర్ణాటక

బిగ్ బాస్ కన్నడ సీజన్ 13లో మొదటివారంలోనే ఊహించని పరిణామం చోటుచేసుకుంది. నటి ప్రథమ ప్రసాద్ హౌస్‌లోకి అడుగుపెట్టకుండానే ఎలిమినేట్ అయ్యారు. విమాన థీమ్ కాన్సెప్ట్ కారణంగా ఆమె మొదటి వారం పూర్తిగా ఫ్లైట్‌లోనే గడిపారు. హోస్ట్ కిచ్చా సుదీప్ తో మాట్లాడుతూ, ఇది దురదృష్టం కాదని, తన కెరీర్‌కు మంచి అదృష్టమని ప్రథమ సానుకూలంగా స్పందించారు.