జీవన విధానానికి భగవద్గీత అద్భుత గ్రంథం: ఎమ్మెల్యే అదితి
రిపోర్టర్: BHAVANI THADI
స్థలం: విజయనగరం
విజయనగరం పట్టణంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా మానవ జీవన విధానానికి, ప్రేమ తత్వానికి భగవద్గీత ఒక అద్భుత గ్రంథమని ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు తెలిపారు. శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ముద్దాడ మధు ఆధ్వర్యంలో నాయకులు ఆమెను కలిసి శ్రీకృష్ణుని చిత్రపటం, ప్రసాదం అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ముద్దాడ రమణి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పాసి అప్పలనాయుడు, పట్టణ ప్రధాన కార్యదర్శి పీతలు కోదండరాం, వడ్డీ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.