నావికుల రక్షణ కోసం భారత్ లైబీరియా దేశాల చరిత్రాత్మక వేదిక
రిపోర్టర్: కృష్ణ
స్థలం: న్యూఢిల్లీ
వాణిజ్య నౌకలు మరియు నావికుల భద్రతను కాపాడే లక్ష్యంతో భారత్, లైబీరియా దేశాలు సంయుక్తంగా ఫ్రెండ్స్ ఆన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ షిప్పింగ్ అండ్ సీఫేరర్స్ వేదికను ఏర్పాటు చేసినట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వెల్లడించారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జరిగిన మంత్రుల స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎర్రసముద్రం ప్రాంతంలో నౌకలపై జరుగుతున్న దాడులు ఆందోళనకరమని, అమాయక ప్రాణాలు కోల్పోవడం సహించరానిదన్నారు.