క్యాన్సర్‌పై విజయం దిశగా మాస్టర్‌చెఫ్ విజేత పంకజ్ భదౌరియా అడుగులు
రిపోర్టర్: శివ
స్థలం: Hyderabad
క్యాన్సర్‌తో పోరాడుతున్న ప్రముఖ మాస్టర్‌చెఫ్ విజేత పంకజ్ భదౌరియా తాజాగా జిమ్‌కు తిరిగి వచ్చారు. తన శరీరాన్ని, ఆరోగ్యాన్ని మళ్లీ దక్కించుకుంటానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే సరికొత్త రూపంలో మీ ముందుకు వస్తానని ఇన్స్టాగ్రామ్ వేదికగా పంకజ్ భదౌరియా స్పష్టం చేసినట్లు ఆమె అభిమానులు తెలిపారు. గత మే నెలలో తనకు రొమ్ము క్యాన్సర్ సోకినట్లు ఆమె వెల్లడించి వైద్య చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే.