కంబాలరాయుడుపేటలో అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ

రిపోర్టర్: Dinesh panda స్థలం: పలాస

కంబాలరాయుడుపేట ఎంపీపీఎస్ పాఠశాల ఆవరణలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని సీమెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఆవిష్కరించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

పాఠశాల ప్రాంగణంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థుల్లో దేశభక్తి, స్వాతంత్ర్య సమరయోధుల పట్ల గౌరవం పెంపొందుతుందని గ్రామస్తులు పేర్కొన్నారు. విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన సీమెన్ అసోసియేషన్ సభ్యులను పలువురు అభినందించారు.