ఉమ్మడి గోదావరి జిల్లాలో ఎలుకల బీభత్సం: పంటను నిలువునా కొరికేస్తున్న వైనం

రిపోర్టర్: నరేష్ స్థలం: West Godavari

ఉమ్మడి గోదావరి జిల్లాలో వరి పొలాల్లో ఎలుకల బెడద తీవ్రస్థాయికి చేరిందని, దీనివల్ల ఎకరాకు రెండు నుంచి నాలుగు బస్తాల వరకు దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త ఎన్.శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణ మార్పుల కారణంగా ఎలుకల సంతతి పెరిగి పంటను నాశనం చేస్తున్నాయని, నివారణ చర్యల కోసం రైతులు ఎకరాకు వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని అన్నదాతలు వాపోతున్నారు.