బిగ్ బాస్ హౌస్‌లో స్మోకింగ్ రూమ్‌కు తాళం వేసిన విక్కీ, రాకేష్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: కేరళ

బిగ్ బాస్ మలయాళం 8 రియాలిటీ షోలో కంటెస్టెంట్లు విక్కీ, రాకేష్ సిగరెట్ మానేయాలనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. వీరు ధూమపానం మానివేయడాన్ని హోస్ట్ మోహన్‌లాల్ ప్రత్యేకంగా అభినందించారు. వారి నిర్ణయానికి ప్రశంసగా హౌస్‌లోని స్మోకింగ్ రూమ్‌ను సీల్ వేయాలని వారి చేతుల మీదుగా టేప్ వేయించారు. ఈ నిర్ణయంపై తోటి కంటెస్టెంట్లు హర్షం వ్యక్తం చేశారు.