తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ
రిపోర్టర్: వెంకట్
స్థలం: హైదరాబాద్
తెలంగాణలో రాగల రెండు నుంచి మూడు గంటల్లో పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్ వెల్లడించింది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వర్ష సూచన ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు స్పష్టం చేశారు.