సినిమా రంగంలో కృత్రిమ మేధ పాత్రపై దర్శకుడు రాజమౌళి కీలక వ్యాఖ్యలు
రిపోర్టర్: హరి
స్థలం: హైదరాబాద్
సినిమా రంగంలో కృత్రిమ మేధ వినియోగంపై అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి స్పష్టతనిచ్చారు. జార్జియా యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడిన ఆయన, ప్రాజెక్టుల పరిశోధన మరియు అభివృద్ధికి ఏఐ ఒక అద్భుతమైన టూల్ అని పేర్కొన్నారు. సినిమాల్లో డిజిటల్ కంటెంట్ తయారీకోసం దానిపై పూర్తిగా ఆధారపడటం లేదని స్పష్టం చేశారు. భారీ సెట్స్, రియల్ లొకేషన్స్ లో షూట్ చేస్తే వచ్చే సహజత్వం ఏఐ ద్వారా రాదని ఆయన అభిప్రాయపడ్డారు. మహేశ్ బాబుతో రూపొందుతున్న సినిమాను తన విజన్ కు అనుగుణంగానే తీర్చిదిద్దుతున్నట్లు ఆయన తెలిపారు.