పాలకొండ అభివృద్ధి హామీతో ప్రజల మద్దతు కోరిన పల్లా విజయనిర్మల
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: పాలకొండ
పాలకొండ నగరపంచాయితీ చైర్మన్ అభ్యర్థిగా బరిలో నిలిచిన పల్లా విజయ నిర్మల స్థానిక ప్రజల మద్దతు కోరుతూ జోరుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా చిత్తశుద్ధితో పనిచేస్తానని హామీ ఇస్తూ ఆమె ఓటర్ల ముందుకు వెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు మరియు స్థానిక కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని విజయనిర్మల గెలుపు కోసం ముమ్మరంగా ప్రచారం చేపట్టారు.