ముప్పై ఐదు వేల మంది విద్యార్థులతో మంగళగిరిలో వరల్డ్ రికార్డు
రిపోర్టర్: సురేష్
స్థలం: మంగళగిరి
మంత్రి నారా లోకేశ్ సూచన మేరకు మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ అధికారులు చేపట్టిన పొడిచెత్త సేకరణ కార్యక్రమం అపూర్వ విజయం సాధించింది. నూట పాఠశాలలకు చెందిన ముప్పై ఐదు వేల మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని డెబ్బై ఐదు వేల కిలోలకు పైగా పొడిచెత్తను సేకరించారు. ఈ మహా యజ్ఞం ద్వారా సరికొత్త వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించినట్లు ఎంటీఎంసీ కమిషనర్ అలీంబాషా వెల్లడించారు. సేకరించిన చెత్తను శాస్త్రీయంగా వేరు చేసి రీసైక్లింగ్ కోసం తరలిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.