అంగన్వాడీ పోస్టుల భర్తీ: ఇంటర్వ్యూ తేదీలను ప్రకటించిన జిల్లా అధికారులు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: తంగళ్లపల్లి

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి బుధ, గురువారాల్ లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి పీ.లక్ష్మీరాజం వెల్లడించారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయని, అర్హత కలిగిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉదయం 10:00 గంటలకు సకాలంలో హాజరు కావాలని ఆయన తెలిపారు.