కేసీఆర్పై రాజకీయ పోస్ట్ పెట్టిన హౌసింగ్ ఏఈపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నిరసన
రిపోర్టర్: కృష్ణ
స్థలం: యాదాద్రి భువనగిరి జిల్లా
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల హౌసింగ్ ఏఈ వివేక్ అధికారిక వాట్సాప్ గ్రూపులో మాజీ సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా రాజకీయ పోస్ట్ పెట్టడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ మండల నాయకులు ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సట్టు తిరుమలేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో రోడ్డుపై బైఠాయించడంతో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్రావు సంఘటన స్థలానికి చేరుకుని, ఏఈపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు నిరసన విరమించి వినతిపత్రం అందజేశారు.