ఓట్ల తొలగింపు దుమారం: కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పుత్తూరు
కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని తిరుపతి జిల్లా పుత్తూరులో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఎస్ఐఆర్ పేరుతో కోట్లాది ఓట్లు తొలగించడం రాజ్యాంగ హక్కులను కాలరాయడమేనని నాయకులు మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీ వెళ్తున్న నిరసనకారులను అడ్డుకోవడం అన్యాయమన్నారు. కేంద్రం స్పందించకుంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.