హాలీవుడ్ లో సంచలనం: తండ్రి బ్రాడ్ పిట్ పేరును తొలగించిన అంజలీ జోలీ కుమార్తె
రిపోర్టర్: కిరణ్
స్థలం: Los Angeles
హాలీవుడ్ ప్రముఖ నటి అంజలీ జోలీ కుమార్తె వివియన్ తన తండ్రి బ్రాడ్ పిట్ ఇంటి పేరును చట్టబద్ధంగా తొలగించుకున్నట్లు మీడియా నివేదికలు వెల్లడించాయి. కాలిఫోర్నియా న్యాయస్థానం సోమవారం ఈ పేరు మార్పును ఆమోదించింది. ఇప్పటికే జోలీ ఇతర పిల్లలు సైతం ఇదే బాటలో నడిచారు. దీంతో ఆమె ఇకపై కేవలం వివియన్ మార్చిలైన్ జోలీ గానే కొనసాగుతారని న్యాయవర్గాలు స్పష్టం చేశాయి.