పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు: కలెక్టర్ హెచ్చరిక
రిపోర్టర్: రాము
స్థలం: విజయనగరం
విజయనగరం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి అర్జీకి సంతృప్తికరమైన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ఎస్ఎల్ఏ గడువు దాటిన దరఖాస్తులను సహించేది లేదని హెచ్చరించారు. విద్యుత్ సేవలను మెరుగుపరచాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే శాఖల అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వివరణ కోరాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ తదితరులు పాల్గొన్నారు.