నేలను కాపాడుకుంటూ లాభాలు పంచే సహజ వ్యవసాయ బాట
రిపోర్టర్: ramesh chitty
స్థలం: బెల్లంపల్లి
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల రైతువేదికలో జాతీయ సహజ వ్యవసాయంలో భాగంగా రైతు శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు రాజా నరేందర్ మాట్లాడుతూ రైతులు సేంద్రియ సాగు ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ తక్కువ పెట్టుబడితో గణనీయమైన లాభాలు పొందవచ్చునని తెలిపారు. చంద్రవెల్లి, గోపాల్ నగర్ గ్రామాల రైతులు పాల్గొన్నారు.