ఖేలో ఇండియా పోటీల ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: హైదరాబాద్
తెలంగాణలో డిసెంబర్ పదకొండు నుంచి ఇరవై రెండు వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ పోటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎక్కడా నాణ్యతా ప్రమాణాల లోపం లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. క్రీడా ప్రాంగణాలు శాశ్వత వనరులుగా ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని, గ్రూప్-వన్ అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలని ఆయన సూచించారు.