సీఈసీ జ్ఞానేశ్ కుమార్కు పద్మ భూషణ్ ఇవ్వాలని బీజేపీ డిమాండ్

రిపోర్టర్: విజయ్ స్థలం: Kolkata

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ను అత్యున్నత పద్మ భూషణ్ పురస్కారంతో సత్కరించాలని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సామిక్ భట్టాచార్య డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను హింస లేకుండా నిర్వహించడంలో, ఓటర్ల జాబితా నుంచి బంగ్లాదేశీయుల పేర్లను తొలగించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని సామిక్ భట్టాచార్య పేర్కొన్నారు. అయితే సీఈసీ తీరుపై టీఎంసీ, కాంగ్రెస్ తదితర విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ మండిపడుతున్నాయి.