జొమాటో వినియోగదారులకు షాక్.. సీఓడీపై అదనపు ఛార్జీల వసూలు!
రిపోర్టర్: శివ
స్థలం: India
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో క్యాష్ ఆన్ డెలివరీ (సీఓడీ) ఎంచుకునే వినియోగదారులపై అదనపు భారం మోపుతోంది. ఆర్డర్ డెలివరీ సమయంలో నగదు చెల్లించే వారి నుంచి రూ.5 నుంచి రూ.20 వరకు ప్రత్యేకంగా ‘పే ఆన్ డెలివరీ ఫీజు’ పేరుతో వసూలు చేయడం ప్రారంభించింది. ఇప్పటికే ప్లాట్ఫామ్, డెలివరీ ఛార్జీలతో సతమతమవుతున్న కస్టమర్లపై ఈ నిర్ణయం తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతోంది.