పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుపై సిబ్బందికి ఎన్నికల అధికారుల వార్నింగ్

రిపోర్టర్: THADI BHAVANI స్థలం: విజయనగరం

పోస్టల్ బ్యాలెట్లకు సెగ్రిగేషన్ తో సంబంధం లేదని, బ్యాలెట్లు అన్నీ ఆరో టేబుల్ వద్ద ఉంటాయని ఎన్నికల సిబ్బంది తెలిపారు. మొదటి పీఎస్ మాత్రమే ఓపెన్ చేసి సర్టిఫికెట్ ఇవ్వాలని, ఒకేసారి అన్ని పీఎస్లు ఓపెన్ చేయకూడదని ఆదేశించారు. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఇరవై ఐదు చొప్పున కట్టలు కట్టి, బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేయకుండా జాగ్రత్త వహించాలని వీడియోలో అధికారులు హెచ్చరించారు.