గిరిజన ప్రాంతాల్లో తవ్వకాలపై ఆదివాసీల ఆందోళన గర్జన

రిపోర్టర్: నేతల ప్రసాద్ బాబు స్థలం: కొయ్యూరు

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బకులూరు గ్రామంలో జరుగుతున్న రంగురాళ్ల అక్రమ తవ్వకాలపై ఆదివాసీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తవ్వకాలకు ప్రయత్నిస్తున్న వారికి అధికారులు సహకరిస్తున్నారని, గ్రామస్తులపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని కొయ్యూరు మండల ఆదివాసీ జేఏసీ అధ్యక్షుడు ఎస్. అశోక్ లాల్ ఆరోపించారు. ఐదో షెడ్యూల్ ప్రాంతాల్లో మైదాన ప్రాంత వ్యక్తులు జేసీబీలతో చొరబడి తవ్వకాలు జరపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.