పెనుగొండపల్లిలో వైభవంగా వినాయక చవితి ఆధ్యాత్మిక వేడుకలు

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: ఐరాల

చిత్తూరు జిల్లా ఐరాల మండలం పెనుగొండపల్లి గ్రామంలో వినాయక చవితి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తిశ్రద్ధలతో వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భజన కార్యక్రమాలు చేపట్టారు. ఐరాల భజన బృందావనం ఆధ్వర్యంలోని బృందం భక్తి గీతాలు ఆలపించి భక్తులను అలరించింది. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.