రూ.లక్ష విరాళం అందజేత: మొక్కు తీర్చుకున్న బెల్లంపల్లి కౌన్సిలర్ బిడ్డల సౌజన్య

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

బెల్లంపల్లి పట్టణంలోని మూడో వార్డు రవీంద్రనగర్ దుర్గామాత కమిటీకి కౌన్సిలర్ బిడ్డల సౌజన్య విజయ్ కుమార్ రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. అమ్మవారి ఆశీస్సులతో ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా ఈ మొక్కు తీర్చుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో దుర్గామాత కమిటీ సభ్యులు, స్థానిక యువకులు, పెద్ద సంఖ్యలో వార్డు ప్రజలు పాల్గొన్నారు.