కొణిజర్ల పొలాల్లో ఎమ్మెల్యే కూనంనేని పర్యటనతో రైతులకు కొండంత భరోసా
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో ఎల్నినో ప్రభావంతో పంటల పరిస్థితిని తెలుసుకునేందుకు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పర్యటించారు. కొణిజర్ల గ్రామంలోని వ్యవసాయ భూములను పరిశీలించి, రైతులతో పంటల స్థితిగతులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు భాగం హేమంతరావు, సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్ రెడ్డి, యర్రా బాబు, దొండపాటి రమేష్, తోట రామాంజనేయులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.