వివేకా హత్య కేసు: ఎంపీ అవినాష్రెడ్డిని విచారిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్

రిపోర్టర్: గోపి స్థలం: తెలంగాణ

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా బుధవారం వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిని ఈడీ అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం. ఈ హత్య కేసులో నలభై కోట్ల రూపాయల సుపారీ వ్యవహారంపై ఈడీ తీవ్రంగా ఆరా తీస్తోంది. మనీలాండరింగ్ కోణంలో ఆర్థిక లావాదేవీలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అధికారులు తెలిపారు.