తుపాను బీభత్సం: శ్రీకాకుళంలో చెట్ల నుంచి కిందపడిన వలస పక్షులు

రిపోర్టర్: రాజేష్ స్థలం: శ్రీకాకుళం

తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలోని తేలుకుంచి కేంద్రంలో వలస పక్షులు చెట్ల నుంచి జారిపడి ప్రమాదానికి గురయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు, అటవీ శాఖ సిబ్బంది వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించి రక్షణ చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై అటవీ అధికారులు స్పందించి తక్షణ సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు అధికారులు వెల్లడించారు.