హురున్ రిచ్ లిస్ట్ జాబితాలో అంబానీని దాటేసిన అదానీ
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: న్యూఢిల్లీ
ఎమ్3ఎం హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2026 జాబితాలో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ కుటుంబం రూ. 9.23 లక్షల కోట్ల నికర సంపదతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో రూ. 8.64 లక్షల కోట్ల సంపదతో ముకేష్ అంబానీ కుటుంబం రెండో స్థానానికి పడిపోగా, రూ. 3.40 లక్షల కోట్లతో ఎల్ఎన్ మిట్టల్ కుటుంబం మూడో స్థానాన్ని దక్కించుకున్నట్లు హురున్ నివేదిక స్పష్టం చేసింది.