కాగజ్నగర్ ప్రాంతంలో గోల్డెన్ డాబాను ప్రారంభించిన ఎమ్మెల్సీ దండే విఠల్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: కాగజ్ నగర్
కొమురం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ ఫారెస్ట్ చెక్పోస్ట్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన గోల్డెన్ డాబాను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాబా నిర్వాహకులు శబ్బా ఖాన్కు శుభాకాంక్షలు తెలిపారు. వ్యాపారం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, యువకులు, స్థానికులు, డాబా నిర్వాహకులు, స్నేహితులు పాల్గొని శబ్బా ఖాన్కు శుభాకాంక్షలు తెలిపారు.