చిన్న మేడారంలో మౌలిక వసతుల కోసం రూ 6 లక్షలు మంజూరు
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం చిన్న మేడారం వద్ద బాత్రూంలు, ఇంకుడు గుంతల ఏర్పాటు కోసం ఆరు లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ఈ నిధులు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సహకారంతోనే లభించాయని బూరుగుపల్లి సర్పంచ్, జాతర నిర్వాహకులు చింతల సంపత్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌కు గ్రామ ప్రజల తరఫున ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.