శ్రీకాకుళం మహిళా కళాశాలలో కేంద్రమంత్రితో కలిసి శ్రమదానం
రిపోర్టర్: గోపి
స్థలం: శ్రీకాకుళం
శ్రీకాకుళం మహిళా కళాశాలలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి శ్రమదానం నిర్వహించినట్లు గొండు శంకర్ తెలిపారు. కళాశాల ప్రాంగణాన్ని పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్ది విద్యార్థినులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పిస్తామని స్పష్టం చేశారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు.