భూభారతి రీ సర్వేపై కలెక్టర్ హైమావతి కీలక ఆదేశాలు జారీ
రిపోర్టర్: విజయ్
స్థలం: సిద్దిపేట
రైతులకు కనీసం రెండు రోజుల ముందుగానే సమాచారం అందించిన తర్వాతే పట్టా భూముల రీ సర్వే చేపట్టాలని జిల్లా కలెక్టర్ కే. హైమావతి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. జగదేవపూర్ మండలం మునిగడప మదీర గ్రామం గోపాల్పూర్ లో జరుగుతున్న భూభారతి రీ సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందని వెల్లడించారు.