ఢిల్లీ విశ్వవిద్యాలయ ఎన్నికల వేళ హింసపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: రాజేష్ స్థలం: న్యూఢిల్లీ

ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం ఎన్నికల ప్రచారంలో చెలరేగిన హింస, విధ్వంసంపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. క్యాంపస్‌లో బయటి వ్యక్తుల ప్రవేశం, అసాధారణ పరిస్థితులపై వివరణ ఇవ్వాలని ఢిల్లీ విశ్వవిద్యాలయం, పోలీసులను ఆదేశించింది. సంతృప్తికరమైన సమాధానం రాకపోతే ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనను నిలిపివేస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది.