టెక్కీలకు భారీ ఊరట: అమెజాన్ ఫెస్టివల్ సేల్‌లో ఇరవై వేలకే శక్తివంతమైన స్మార్ట్ఫోన్లు
రిపోర్టర్: గోపి
స్థలం: Hyderabad
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభమైందని, తక్కువ ధరలకే బెస్ట్ ఫైవ్ జీ స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయని ఈకామర్స్ వర్గాలు తెలిపాయి. దసరా, దీపావళి పండుగలను దృష్టిలో ఉంచుకొని ప్రముఖ బ్రాండ్ల మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఎస్బీఐ కార్డులతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్ సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఐక్యూ, రెడ్ మీ, వన్‌ప్లస్, శాంసంగ్ వంటి మొబైల్ ఫోన్లు ఇరవై వేల లోపు ధరలకే లభిస్తాయని పేర్కొన్నారు.