నీట్ యూజీ రౌండ్-3 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేసిన ఎంసీసీ

రిపోర్టర్: గోపి స్థలం: India

వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ 2026 రౌండ్-3 మరియు స్ట్రే వేకెన్సీ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ విడుదల చేసింది. సెప్టెంబర్ 22 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ mcc.nic.in ద్వారా పూర్తి షెడ్యూల్‌ను పరిశీలించి, దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.