మధ్యప్రదేశ్ లో షాకింగ్ ఘటన: కూలిన గది నేల, గుంతలో పడ్డ మహిళ

రిపోర్టర్: కిరణ్ స్థలం: Madhya Pradesh

మధ్యప్రదేశ్ లోని భిండ్ లో గది నేల ఒక్కసారిగా కుప్పకూలడంతో నూటఐదు సంవత్సరాల క్రితం నాటి చారిత్రక భవనంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. బెడ్ షీట్ మారుస్తున్న నలభై ఐదు సంవత్సరాల మహిళ పదిహేను అడుగుల లోతైన భూగర్భ గుంతలో పడిపోయినట్లు అధికారులు వెల్లడించారు. కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే స్పందించి నిచ్చెన సహాయంతో ఆమెను సురక్షితంగా వెలికితీశారు. స్వల్ప గాయాలతో ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.