వైద్యారోగ్య శాఖ ఒప్పంద ఉద్యోగుల సమ్మె విరమణ: విధులకు హాజరు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ ఒప్పంద ఉద్యోగుల సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ఏపీఎంహెచ్సీఈ జేఏసీ ఛైర్మన్ జి.కోటేశ్వరరావు, కన్వీనర్ ఎం.అజయ్‌కుమార్ వెల్లడించారు. ఉన్నతాధికారులతో జరిగిన చర్చల్లో కొన్ని అంశాలపై సానుకూల స్పందన వచ్చిందని శనివారం తెలిపారు. ఉద్యోగుల ప్రయోజనాలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని, ఆదివారం నుంచి అందరూ విధులకు హాజరు కావాలని వారు కోరారు.