'ఒరిజిన్ ఓఎస్ 7 ప్రివ్యూ ప్రకటన': వివో, ఐక్యూఓ యూజర్లకు శుభవార్త

రిపోర్టర్: రాము స్థలం: ఇండియా

భారతదేశంలోని వివో ఎక్స్300 ప్రో మరియు ఐక్యూఓ 15 స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం వివో మరియు ఐక్యూఓ కంపెనీలు ఆండ్రాయిడ్ 17 ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 7 ప్రివ్యూ ప్రోగ్రామ్‌ను అధికారికంగా ప్రకటించాయి. ఈ ప్రత్యేక సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కోసం పరిమితంగా కేవలం 500 స్లాట్లను మాత్రమే కేటాయించగా, ఆసక్తి గల వినియోగదారులు సెప్టెంబర్ 20 లోపు తమ ఫోన్ల సెట్టింగ్స్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కంపెనీలు సూచించాయి. ఈ నెల 21న ప్రపంచవ్యాప్తంగా ఈ లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ లాంచ్ కానుంది.