భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా వినాయక నిమజ్జనోత్సవం

రిపోర్టర్: sankar p స్థలం: మనుబోలు

నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని పడమటి వీధిలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన విగ్రహానికి గురువారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి అంగరంగ వైభవంగా నిమజ్జనోత్సవం చేపట్టారు. ఈ వేడుకకు బొమ్మిరెడ్డి మధుసూదన్ రెడ్డి జానకి దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించగా, అర్చకులు కుమార్ శర్మ ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులు పెద్దఎత్తున పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.