కడపలో రికార్డు స్థాయిలో 531 మొబైల్ ఫోన్ల రికవరీ

రిపోర్టర్: అశోక్ స్థలం: కడప

కడప జిల్లాలో 'ఆపరేషన్ మొబీ ట్రాక్' ద్వారా పోలీసులు సంచలనం సృష్టించారు. కేవలం 60 రోజుల్లో రూ.1.06 కోట్ల విలువైన 531 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. ఇప్పటివరకు పది విడతల్లో రూ.13.73 కోట్ల విలువైన 7,018 ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ పోయిన వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని, బ్యాంక్ ఖాతాలను వెంటనే బ్లాక్ చేసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు.