డిజిటల్ అరెస్ట్ మోసాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం: బాధ్యత బ్యాంకులదేనని స్పష్టీకరణ

రిపోర్టర్: శివ స్థలం: న్యూఢిల్లీ

దేశంలో రోజురోజుకు పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్ సైబర్ మోసాలపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖాతాదారుల సొమ్ముకు ఆర్థిక సంస్థలే పూర్తి బాధ్యత వహించాలని జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసినట్లు అధికారులు తెలిపారు. బ్యాంకుల నిర్లక్ష్యం రుజువైతే బాధితులు కోల్పోయిన మొత్తాన్ని పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది.