సన్న వడ్ల బోనస్ నమోదు గడువు పొడిగింపు

రిపోర్టర్: కిరణ్ స్థలం: తెలంగాణ

తెలంగాణలో వానాకాలం సీజన్‌లో సన్న వడ్లు సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. క్వింటాల్ సన్న ధాన్యానికి రూ.500 బోనస్ పొందేందుకు సాగు వివరాల నమోదు గడువును ఈ నెల 17 వరకు వ్యవసాయ శాఖ పొడిగించింది. అర్హులైన రైతులు విత్తన కొనుగోలు వివరాలతో ఆన్‌లైన్‌లో తక్షణమే పంట నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.