ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శశిథరూర్ చిన్న పొరపాటు

రిపోర్టర్: సునీల్ స్థలం: India

కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపే క్రమంలో చిన్న వ్యాకరణ పొరపాటు చేశారు. ప్రధాని 76వ పుట్టినరోజు సందర్భంగా ఆన్ బర్త్‌డే అనబోయి ఇన్ బర్త్‌డే అంటూ తప్పుగా పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ చిన్న పొరపాటును ఎత్తిచూపగా శశిథరూర్ వెంటనే స్పందించి అది కేవలం టైపింగ్ లో జరిగిన చిన్న తప్పు మాత్రమేనని క్రీడాస్ఫూర్తితో బదులిచ్చారు.