ఇందిరమ్మ ఇళ్ల ఆర్థిక సాయం పెంచాలి: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

రిపోర్టర్: సతీష్ స్థలం: తెలంగాణ

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తున్న రూ.5 లక్షల సాయం సరిపోదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో స్పష్టం చేశారు. పెరిగిన మెటీరియల్, కూలీల ధరలతో ఒక్కో ఇందుకు రూ.10 నుంచి 15 లక్షల వరకు ఖర్చవుతోందని తెలిపారు. లబ్ధిదారులు అప్పులపాలు కాకుండా ప్రభుత్వం సాయాన్ని పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.