ఎన్టీఆర్ జిల్లాలో మహిళ దారుణ హత్య నిందితుడు అరెస్ట్

రిపోర్టర్: అశోక్ స్థలం: ఎన్టీఆర్ జిల్లా

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసు మిస్టరీని పోలీసులు వీడగొట్టారు. మృతురాలిని మంగళగిరికి చెందిన కళ్యాణిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. భవానిపురానికి చెందిన షఫి అనే వ్యక్తి వివాహేతర సంబంధం నేపథ్యంలో ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. కుమారుడిని తనకు అప్పగించాలని కళ్యాణి ఒత్తిడి తేవడంతోనే ఆమెను కిరాతకంగా హత్య చేసి, శరీర భాగాలను కెనాల్ లో పడేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.