వైద్యం అందక విషాదం: జ్వరంతో బిడ్డతో సహా గర్భిణి మృతి

రిపోర్టర్: T.RAJASHEKAR స్థలం: నర్సంపేట

నర్సంపేట మండలం చంద్రయ్యపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న నవ్య అనే తొమ్మిది నెలల గర్భవతి, కడుపులోని బిడ్డతో సహా మృతి చెందింది. వారం రోజులుగా జ్వరంతో బాధపడుతుండటంతో మొదట స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హనుమకొండలోని ఆసుపత్రికి మార్చగా, చికిత్స పొందుతూ మరణించింది. భర్త, కుమారుడు రోదిస్తున్న తీరు అందరిని కలిచివేసింది.