ఆమనగల్లులో కార్తికేయ డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభం.. తక్కువ ధరలకే వైద్య పరీక్షలు అందించాలని ఎమ్మెల్యే పిలుపు!

రిపోర్టర్: Abdul Azeem స్థలం: ఆమనగల్

రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణంలో అత్యాధునిక పరికరాలతో ఏర్పాటు చేసిన కార్తికేయ డయాగ్నస్టిక్ సెంటర్ను బుధవారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్ ట్రిబ్యునల్ చైర్మన్ సూదిని రాంరెడ్డి, నిర్వాహకులతో కలిసి ప్రారంభించారు. పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని తక్కువ ధరలకే ఆరోగ్య పరీక్షలు చేయాలని నిర్వాహకులను కోరారు. ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే అన్ని రకాల పరీక్షలు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పత్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.