ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు

రిపోర్టర్: sujith reddy స్థలం: నెల్లూరు అర్బన్

నెల్లూరు జిల్లా ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేశ్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా సుదీర్ఘకాలం పాటు ప్రజాక్షేత్రంలో సేవనందిస్తున్న నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 17వ తేదీన ప్రజలందరూ తమ ఇళ్లలో ఆశీర్వద దీపం వెలిగించి ప్రధాని మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలపాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు.