ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో క్షేత్రస్థాయిలో కఠిన తనిఖీలు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: హైదరాబాద్

ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపికలో ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. లాటరీలో పేరు వచ్చినా, క్షేత్రస్థాయిలో అర్హత ఉంటేనే ఇల్లు దక్కుతుంది. 16 నియోజకవర్గాల్లో 80 బృందాలతో అధికారులు ఇంటింటి తనిఖీలు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల వారు, సరైన పత్రాలు లేని వారిని జాబితా నుంచి తొలగిస్తున్నారు. స్థానికులకే ప్రాధాన్యతనిస్తూ, అనర్హులను ఏరివేసే ప్రక్రియను వేగవంతం చేశారు.